Home  »  TV News  »  రిషి ఇంటికి అతిథిగా జయచంద్ర.. రూమ్ ఖాళీ చేసిన వసుధార!

Updated : Apr 2, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -726 లో కాలేజీని విజిట్ చేయడానికి జయచంద్ర వస్తున్నాడని ఫణింద్ర వాళ్ళు కావలిసిన ఏర్పాట్లు చేస్తారు. ఇంతలోనే రిషి వచ్చి జయచంద్ర గారికి హోటల్స్ లో ఉండడం ఇష్టముండదంట అని చెప్తాడు. జగతి, మహేంద్ర, ఫణింద్ర, వసుధార లు అక్కడే ఉంటారు. మన కాలేజీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేద్దామా అని మహేంద్ర అనగానే.. సర్ కి అక్కడ ఉండడం ఇష్టం ఉంటుందో ఉండదో అని రిషి అంటాడు. ఇంతలోనే వసుధార మధ్యలో కలుగజేసుకొని.. సర్ మన ఇంట్లోనే ఉండేవిధంగా ఏర్పాటు చేద్దామని అంటుంది. రిషి, ఫణింద్రలు మంచి ఆలోచన అంటారు. అక్కడే ఉన్న దేవయాని.. అతను ఇంటికి ఎందుకు? అయినా గెస్ట్ రూమ్ లో వసుధార ఉంటుంది కదా అని దేవాయని అంటుంది. నేను ధరణి మేడం రూమ్ లో అడ్జస్ట్ అవుతానని వసుధార చెప్తుంది. కోపంతో దేవయాని వెళ్లిపోతుంటే.. పెద్దమ్మ ఎక్కడికి అంటాడు రిషి. జయచంద్ర గారు ఉండడానికి ఇంట్లో ఏర్పాట్లు చేస్తానని, తనకి ఇష్టం లేకున్నా అలా మాట్లాడి వెళ్ళిపోతుంది దేవయాని. 

ఆ తర్వాత జయచంద్ర కాలేజీకి వస్తాడు. తనని అందరూ కలిసి లోపలికి ఆహ్వానిస్తారు. మహేంద్ర అందరిని పరిచయం చేస్తాడు. జయచంద్ర రిషి గురించి  కాలేజీ గురించి  గొప్పగా స్పీచ్ ఇస్తాడు. స్టూడెంట్స్ తో కాసేపు మాట్లాడి ఓల్డ్ కల్చర్, మోడరన్ కల్చర్ గురించి రేపు వివరిస్తానని జయచంద్ర స్టూడెంట్స్ కి చెప్తాడు. ఆ తర్వాత కాలేజీకి సంబంధించిన అన్ని రకాల ప్రోగ్రామ్స్ గురించి లాప్టాప్ లో వివరిస్తాడు రిషి. జయచంద్రకి రిషి వారి ఇంట్లోనే ఉండేలా ఏర్పాట్లు చేసానని చెప్తాడు. నాకు మీతో గడపడం సంతోషమే అని ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్తుండగా రిషి.. సర్ రావడం ఇంకా ఆశ్చర్యంగానే ఉంది. అంత గొప్ప వ్యక్తి మన ఇంటికి రావడం గ్రేట్ అని రిషి అంటాడు‌. సర్ వెళ్లిపోయేంత వరకు మనం ప్రశాంతంగా గొడవలు లేకుండా ఉందామని రిషి అనగానే.. సరే అంటుంది వసుధార. మరోవైపు ధరణి వసుధార రూమ్ లోని బట్టలు తీసుకుపోతుండగా వసుధార చున్నీ ఒకటి కింద పడిపోతుంది.

ఆ తర్వాత జయచంద్ర ఇంటికి వస్తాడు. దేవయాని తనని తాను పరిచయం చేసుకుంటుంది. మీ కోసం రూమ్ ఏర్పాటు చేసామని చెప్పి, రిషి తీసుకెళ్ళు అని అంటుంది.. రిషి, వసుధారలు జయచంద్రకు రూమ్ చూపిస్తారు. అందులో తన  చున్నీ కిందపడి ఉండడం చూస్తుంది వసుధార. జయచంద్ర సర్ చూడకముందే అది తీసెయ్యాలని రిషికి సైగ చేస్తుంటే.. జయచంద్ర వసుధారని చూసి, ఆ చున్నీ వైపు చూసి ఇంతకుముందు ఈ గదిలో అమ్మాయి ఉండేదా అని అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.